రాజకీయ మైలేజ్ కోసమే నాపై కేసు..నా ఇమేజీని, పార్టీ ఇమేజీని దెబ్బతీసే కుట్ర : రాహుల్ గాంధీ

రాజకీయ మైలేజ్ కోసమే నాపై కేసు..నా ఇమేజీని, పార్టీ ఇమేజీని దెబ్బతీసే కుట్ర : రాహుల్ గాంధీ
  • డిఫమేషన్ కేసులో యూపీ కోర్టుకు హాజరైన ఎంపీ

సుల్తాన్​పూర్(యూపీ): లోక్​సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ డిఫమేషన్ కేసులో ఉత్తరప్రదేశ్ ​ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ముందు హాజరయ్యారు. 2108లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో  నాటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు నమోదైన పరువునష్టం కేసులో రాహుల్  గాంధీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. 

స్టేట్​మెంట్ రికార్డు చేసిన అనంతరం కోర్టు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా ఇమేజీతో  పాటు పార్టీ ఇమేజీ కూడా దెబ్బతీయాలని చూస్తున్నారు. నాపై మోపిన ఆరోపణలన్నీ అవాస్తవం. నేను ఎవరికీ వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకర భాష వాడలేదు. 

ఒకరి పరువుకు భంగం కలిగించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నాపై తప్పుడు కేసు పెట్టారు” అని రాహుల్  చెప్పారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది.