మాజీ కేంద్ర మంత్రి మృతి: పాడె మోసిన రాహుల్

మాజీ కేంద్ర మంత్రి మృతి: పాడె మోసిన రాహుల్

కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ కేం‍ద్ర మంత్రి కెప్టెన్‌ సతీష్‌ శర్మ రెండు రోజుల క్రితం చనిపోయారు. ఇవాళ(శుక్రవారం) సతీష్‌ శర్మ అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ …సతీష్‌ శర్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

కెప్టెన్ సతీష్‌ శర్మ మృతి గురించి తెలిసిన వెంటనే రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మరువలేమన్నారు.

సతీష్‌ శర్మ గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గోవాలోని తన నివాసంలో మృతి చెందారు. రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఆయనకు మెంటార్‌గా వ్యవహరించారు. పీవీ ప్రభుత్వంలో సతీష్‌ శర్మ 1993 నుంచి 1996 వరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు రాయ్‌ బరేలి, అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతేకాదు సతీష్‌ శర్మ ప్రొఫెషనల్‌ కమర్షియల్‌ పైలెట్‌ కూడా.