8 గంటలు నడుస్తం.. 15 నిమిషాలే మాట్లాడుతం: రాహుల్

8 గంటలు నడుస్తం.. 15 నిమిషాలే మాట్లాడుతం: రాహుల్

బోర్గావ్/రుస్తంపూర్​(మధ్యప్రదేశ్): కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్​జోడో యాత్రలో భాగంగా ప్రతీ ఒక్కరి మన్​కీ బాత్​ వింటామని, తమది మోడీలాంటి మన్​కీ బాత్​ కాదంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా బుర్హాన్‌‌పూర్‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘ప్రజల ‘‘మన్ కీ బాత్” వినడానికి మేము ప్రతీ రోజు దాదాపు 8గంటలు నడుస్తాం. సగటున 25 కిలో మీటర్లు తిరుగుతున్నాం. యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతాం. మేము 8గంటల పాటు ప్రజల ‘‘మన్ కీ బాత్” వింటాం. కేవలం 15 నిమిషాలే మాట్లాడుతాం. ప్రధాని మోడీ ‘‘మన్ కీ బాత్’’లాగా కాదు. రోజంతా రైతులు, యువత, మహిళలు, కూలీలు, చిన్నతరహా వ్యాపారుల మనసులో ఏముందో వింటాం”అని రాహుల్​ అన్నారు. 

మన ప్రభుత్వాన్ని పడగొట్టారు..

మధ్యప్రదేశ్​లో అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. దారి వెంట ప్రతీ ఒక్కరితో మాట్లాడుతామని, రైతులు, ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటామన్నారు. ‘‘భారత్​జోడో యాత్ర ప్రారంభించినప్పుడు 3,300 కి.మీ నడవలేరని ప్రజలన్నారు. విపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్​కు వచ్చేశాం. ఇక్కడ 370 కి.మీ నడుస్తాం. ఈ యాత్ర కచ్చితంగా శ్రీనగర్​ చేరుకుంటుంది. దీన్నెవరూ ఆపలేరు”అని రాహుల్ అన్నారు.

యాత్రలో అన్నతో కలిసి ప్రియాంక.. 

భారత్​జోడో యాత్రలో భాగంగా అన్న రాహుల్​తో కలిసి కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంకా గాంధీ నడిచారు. గురువారం మధ్యప్రదేశ్​లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్​ వాద్రా, కొడుకు రోహిన్​తో కలిసి ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్​7న కన్యాకుమారిలో భారత్​జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత తొలిసారి రాహుల్​తో ప్రియాంక కలిసి నడిచారు. రాహుల్​, ప్రియాంక, రాబర్ట్​ వాద్రా మాట్లాడుకుంటూ.. ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతున్నంత సేపు లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్నాచెల్లెల పాదయాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అయ్యాయి. కర్నాటకలో పాదయాత్ర సాగుతున్న టైంలో సోనియా గాంధీ కూడా రాహుల్​తో కలిసి నడిచారు.