మీరు నా పెద్దన్న.. డీకేను బుజ్జగించిన రాహుల్ గాంధీ

మీరు నా పెద్దన్న.. డీకేను బుజ్జగించిన రాహుల్ గాంధీ

డీకేను బుజ్జగించటంలో రాహుల్ గాంధీ కిలక పాత్ర పోషించారు. ఒకటికి పది సార్లు రాహుల్ గాంధీ డీకేతో స్వయంగా మాట్లాడారు. బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడటంతోపాటు.. ఢిల్లీకి చేరుకున్న డీకేతో స్వయంగా చర్చించారు. నా అన్నగా భావిస్తున్నా.. నీకు పార్టీలో అన్యాయం జరగదు.. ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది.. నిన్ను పార్టీ వదలుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. నేనే కాదు.. అమ్మ కూడా నీ విషయంలో చాలా పాజిటివ్ గా ఉంది.. నిన్ను ఎప్పుడూ పార్టీ వ్యక్తిగా చూడలేదు.. వ్యక్తిగతంగా.. మా కుటుంబంలో ఒకరిగా చూశాం.. నీవు పార్టీని చేసిన సేవల విషయంలో ఎలాంటి లోటు లేదు.. ఎంతో కష్టపడ్డారు.. ఈసారికి మా మాట వినండి.. మీ డిమాండ్లు అన్నీ నెరవేరుస్తాం.. ఈ ఒక్కసారిగా మా వినండి.. పార్టీ కోసం ఇంత చేశారు.. ఈ ఒక్కసారి కొంచెం వినండి అంటూ రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా చర్చించారంట..

సోనియా, రాహుల్ గాంధీ పదేపదే రిక్వెస్ట్ చేయటంతో వెనక్కి తగ్గారు డీకే శివకుమార్. పార్టీ ఇంత గుర్తింపు ఇస్తున్నప్పుడు.. అన్నింటికీ ఓకే చెబుతున్నప్పుడు.. మరీ బెట్టు చేస్తే బాగుండదనే ఉద్దేశంతోనే డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మూడు రోజులపాటు రాహుల్ గాంధీ స్వయంగా డీకేతో మాట్లాడుతూ ఆయన్ను కూల్ చేశారు. కొంచెం ఓపిక పట్టండి అంటూ పదేపదే రిక్వెస్టులు రావటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

సిద్ధరామయ్యను సీఎంగా నిర్ణయించిన తర్వాత కూడా.. వారి భేటీ ముగిసిన తర్వాత కూడా.. డీకేతో గంటపాటు ఏకాంతంగా చర్చించారు రాహుల్ గాంధీ. సిద్ధరామయ్య, జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, ప్రియాంక గాంధీల సమక్షంలో స్పష్టమైన హామీ లభించటంతో డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.