రాహుల్ అరెస్టు  అప్రజాస్వామికం : రేపు (అక్టోబర్ 8) చలో లోక్భవన్ : పీసీసీ చీఫ్ 

రాహుల్ అరెస్టు  అప్రజాస్వామికం : రేపు (అక్టోబర్ 8) చలో లోక్భవన్ : పీసీసీ చీఫ్ 

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ఓట్ల తొలగింపు, సర్ ప్రక్రియలో జరిగినఅక్రమాలను ప్రశ్నిస్తే లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విధానాలకే గొడ్డలిపెట్టు లాంటిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనికి నిరసనగా గురువారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘సేవ్‌‌ డెమోక్రసీ’ పేరుతో చలో లోక్​భవన్​  కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.