రాహుల్ గాంధీ వైష్ణో దేవి యాత్ర

రాహుల్ గాంధీ వైష్ణో దేవి యాత్ర

జమ్మూ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ వైష్ణోదేవి యాత్ర ప్రారంభించారు. ఇవాళ జమ్మూలోని కాత్రాకు చేరుకున్న ఆయన..  ఇక్కడి నుంచి ఆయన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. మధ్యలో ఆయన భక్తులతో మాటామంతీ జరుపుతూ ముందుకు సాగారు. రేపు శుక్రవారం ఆయన  వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. 
రాహుట్ గాంధీ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోని ముఖ్య నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏఐసీసీ నేతలు ఈ విషయం మీడియా ఎదుట స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నెలరోజుల వ్యవధిలో జమ్మూ, కాశ్మీర్‌కు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభించేందుకు ఆయన శ్రీనగర్‌ వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ పర్యటన గురించి కొద్దిసేపు ముందే తెలుసుకున్న పార్టీ శ్రేణులు తమ నేతకు ఆహ్వానం పలికేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.