ప్రధానిపై రాహుల్ విమర్శలు : రైతులందర్ని బీహార్ రైతుల్లా మార్చేస్తారా

ప్రధానిపై రాహుల్ విమర్శలు : రైతులందర్ని బీహార్ రైతుల్లా మార్చేస్తారా

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.., ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దేశంలో అత్యధికంగా, అతితక్కువ వార్షి ఆదాయాన్ని పొందుతున్న ఆయా రాష్ట్రాల రైతుల గురించి చేసిన సర్వేని షేర్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ

దేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే ..ప్రధాని మోడీ మాత్రం అతితక్కువ ఆదాయం ఉన్న బీహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తున్నారని అన్నారు.

బిజినెస్ టుడే మనదేశంలో ఏ రాష్ట్రంలోని రైతులు ఎంత వార్షిక ఆదాయం పొందుతున్నారో సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా సంవత్సరానికి రూ.2లక్షలకి పైగా వార్షిక ఆదాయం సంపాదిస్తున్న పంజాబ్ రైతులతో…, దేశంలో రూ.42,684తో అతితక్కువ వార్షిక ఆదాయం పొందుతున్న బీహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు.

కాగా కొత్త వ్యవసాయ చట్టాలపై అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా రైతు సంఘాలకు కేంద్రం కొన్ని ప్రతిపాదనలు పంపింది. అయితే రైతు సంఘాల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి జవాబు రాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.