
- జోడో యాత్రను సక్సెస్ చేస్తమని కామెంట్ చేసిన కాంగ్రెస్ లీడర్
- రాజస్థాన్ కాంగ్రెస్‌లో అందరూ కలిసే ఉన్నారని వివరణ
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కాంగ్రెస్ లీడర్లంతా కలిసిమెలిసి ఉన్నారని, ఎవరితో ఎవరికీ ఎలాంటి విభేదాల్లేవని పార్టీ సీనియర్ లీడర్ సచిన్ పైలట్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం రాజస్థాన్‌లో ఎంటర్ అయ్యిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌లో యాత్రను సక్సెస్ చేయాలన్న దానిపైనే అందరి ఫోకస్ ఉందని చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్‌తో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సీఎం పోస్టు కోసం బీజేపీలోనే డజన్ల కొద్ది ఆశవాహులు ఉన్నారని విమర్శించారు. అసలైతే బీజేపీలోనే అంతర్గత పోరు నడుస్తున్నదన్నారు.
మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కష్టపడి పని చేస్తామని సచిన్ పైలెట్ అన్నారు. భారత్ జోడో యాత్రపై చర్చించేందుకే గత వారం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జైపూర్ వచ్చారని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్రకు సంబంధించినంత వరకు, పార్టీలో ఏకాభిప్రాయం ఉందని, దాన్ని విజయవంతం చేయడానికి తామంతా కలిసి పని చేస్తున్నట్టు వివరించారు. నెక్ట్స్ జనరేషన్ మాట్లాడుకునేలా యాత్రను సక్సెస్ చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఫస్ట్ టైం భారత్ జోడో యాత్ర సాగుతున్నదని పైలట్ చెప్పారు.