పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

తుఫాన్ బాధితులకు పార్టీ తరపున కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘తౌక్టే తుఫాను బలంగా మారుతోంది. దయచేసి అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి. తుఫాన్ బాధితులకు కాంగ్రెస్ కార్యకర్తలు సాయమందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కాగా.. తౌక్టే తుఫాన్ అల్పపీడనంగా మారి క్రమేపీ తీవ్ర తుఫాన్‌గా మారింది. దాంతో పలు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి కేరళలో ఇద్దరు, కర్ణాటకలో నలుగురు మరణించారు. కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. గోవాలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.