తల్లితో రాహుల్ గాంధీ ఫన్నీ మూమెంట్..వీడియో వైరల్

తల్లితో రాహుల్ గాంధీ ఫన్నీ మూమెంట్..వీడియో వైరల్

కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ తన తల్లితో సరదాగా ఉన్నారు. తన తల్లి ముఖాన్ని నిమురుతూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇటీవలె ఇటువంటి ఫొటోనే రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో రాహుల్, సోనియా భుజంపై చేయి వేసి నవ్వుతూ కనిపిస్తారు. తన తల్లి నుంచి లభించిన ప్రేమను యావత్ దేశ ప్రజలకు తాను పంచుతున్నానని ఆ పోస్ట్ లో రాహుల్ వ్యాఖ్యానించారు. అప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

ఇంతకుముందు సోనియాగాంధీ భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు కూడా ఇటువంటి ఘటనే జరిగింది.  యాత్రలో భాగంగా వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో సోనియా షూ లేస్ ఊడగా.. సెక్యూరిటీ, ఇతర నేతలను పక్కకు జరిపి మరీ.. రాహుల్ స్వయంగా తన తల్లి లేస్ క‌ట్టారు. అప్పట్లో ఆ సన్నివేశం అందర్నీ ఆకర్షించింది.