
12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోడీ సర్కార్‌కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి ఇవాళ (మంగళవారం) ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల ప్రాధాన్యత, నిరసన గురించి మోడీ ప్రభుత్వానికి ట్యూషన్ అవసరమని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమైన మొదటి రోజే నవంబర్ 29న 12 మంది రాజ్యసభ విపక్ష సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేశారు.
వర్షాకాల సమావేశాల్లో అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు మోడీ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. మరోవైపు రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ ప్రదర్శన నిర్వహించారు.
రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు గందరగోళం సృష్టిస్తుండటంతో గత కొద్దిరోజులుగా పెద్దల సభలో కార్యకలాపాలు సజావుగా జరగడంలేదు.