తనను తాను రాజు అనుకుంటున్నాడు.. ప్రజలే జైలుకు పంపిస్తరు:రాహుల్గాంధీ

తనను తాను రాజు అనుకుంటున్నాడు.. ప్రజలే జైలుకు పంపిస్తరు:రాహుల్గాంధీ
  • హిమంత బిశ్వ శర్మపై రాహుల్ గాంధీ ఫైర్
  • తనను తాను రాజులాగా భావిస్తున్నడని వ్యంగ్యం

గువాహటి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనను తాను ఓ రాజులాగా ఊహించుకుంటున్నారని లోక్‌‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్‌‌ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ , ఆయన కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. త్వరలో ఆయనను రాష్ట్ర ప్రజలే జైలుకు పంపుతారని తెలిపారు.  అస్సాం చాయ్‌‌గావ్‌‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రాహుల్‌‌ గాంధీ అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఫైర్ అయ్యారు. "సీఎం హిమంత బిశ్వ శర్మ తనను తానొక రాజుగా ఊహించుకుంటున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని భరించలేక అస్సాం ప్రజలే ఆయనను జైలులో వేస్తారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న జనాదరణ చూసి ఇప్పటికే హిమంతకు భయం పట్టుకుంది. ప్రతి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు జాబితా సవరణ పేరుతో మోసం చేసి బీజేపీ గెలిచింది. 

బిహార్‌‌లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అస్సాంలోనూ అలాగే చేయబోతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మీడియా ఇప్పుడు నిజాలు చెప్పట్లేదు. కేవలం అదానీ, అంబానీ, సీఎం, మోదీ, అమిత్ షా గురించి మాత్రమే చూపిస్తున్నాయి. అయినప్పటికీ, వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. 

ఆర్‌‌ఎస్‌‌ఎస్ చూపే  ద్వేషం, హింసలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యం, అహింస ఉన్నాయి. దేశంలో ఇప్పుడు ఒక ధనికుల హిందుస్థాన్‌‌, మరొక పేదల హిందుస్థాన్ మాత్రమే ఉన్నాయి" అని రాహుల్ పేర్కొన్నారు.