రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ : జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్  : జగ్గారెడ్డి
  •      రాముడు మెచ్చిన పాలనను అందిస్తడు 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ ప్రధాని కావాలనుకుంటే యూపీఏ ప్రభుత్వంలోనే అయ్యేవారని అన్నారు. 

కానీ, మన్మోహన్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని చేశారని గుర్తు చేశారు. రాహుల్ నాయకత్వం ముందు ఈటల రాజేందర్ రాజకీయ జీవితం చాలా చిన్నదని చెప్పారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అద్వానీ రథయాత్ర చేయడానికి ముందు నరేంద్ర మోదీ ఎవరో ఎవరికీ తెలియదని అన్నారు. అద్వానీ పంపిన సీల్డ్ కవర్ ద్వారా మోదీ ఆనాడు సీఎం అయ్యారని వెల్లడించారు. సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి.. సీల్డ్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం అయిన మోదీకి చాలా తేడా ఉందన్నారు.

 అయోధ్యలో రామాలయం కట్టడంతోనే సమస్యలు అన్ని సమసి పోతాయా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నిజమైన శ్రీరాముడి వారసుడు రాహుల్ గాంధీ అని అన్నారు. రాముడు కూడా గుడి కట్టాలని కోరుకోడని, పేద ప్రజలకు తిండి, గుడ్డ, గూడు అందించాలని అనుకుంటాడని చెప్పారు. పేద ప్రజలకు అవన్నీ ఇచ్చి రాముడి మనసు గెలుచుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. బీజేపీ నేతలు ఎంపీ ఎన్నికల్లో గెలవాలని రామమందిరం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరమీదకు తెస్తున్నారన్నారు. రాముడు మెచ్చిన పాలననను రాహుల్ గాంధీ అందిస్తారని స్పష్టం చేశారు. జనాలకు సేవ చేయమని రాముడు చెబితే, మోదీ అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.