భారత్​ జోడో 2.0.. రెడీ అవుతోన్న రాహుల్​గాంధీ.. ఇప్పుడెక్కడినుంచంటే?

భారత్​ జోడో 2.0.. రెడీ అవుతోన్న రాహుల్​గాంధీ.. ఇప్పుడెక్కడినుంచంటే?

రానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్​సభ ఎలక్షన్లే టార్గెట్ గా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి కశ్మీర్​కి ఓ విడత పాదయాత్రగా 'భారత్​జోడో' ని చేపట్టి పబ్లిక్​ ని ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు జోడో వర్షన్​ 2.0 అని వస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన గ్రౌండ్​ వర్క్​ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. యాత్ర రెండో విడత గుజరాత్ లోని పోర్​బందర్​ నుంచి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ యాత్ర గుజరాత్​నుంచి త్రిపుర రాజధాని అగర్తల వరకు జరగనుంది. 

ఇదే అంశాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్ సింగ్​ఆధ్వర్యంలో ఆ పార్టీ కమిటీ గత వారం చర్చించింది. రానున్నది మొత్తం ఎన్నికల కాలం కావడంతో దానికి అనుబంధంగా బస్సు యాత్రలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే 2022 సెప్టెంబర్​ 7 నుంచి 30 జనవరి 2023 వరకు రాహుల్ గాంధీ భారత్​జోడో యాత్రను నిర్వహించారు. ఈ యాత్రతో కర్ణాటకలో అధికారంలోకి రావడంతో పాటు.. తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. 

దీనితో పాటు ప్రతిపక్షాల ఐక్యత సాధించి 'ఇండియా' కూటమి ఏర్పాటుకు జోడో యాత్ర సహకరించిందని సీనియర్​ నేతలు అంటున్నారు. భారత్​జోడో రెండో విడత కాంగ్రెస్​ని లోక్​సభ ఎన్నికలకు సమాయత్తం చేసే సాధనంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.