దిగ్విజయ్​ది తప్పే : రాహుల్​ గాంధీ

దిగ్విజయ్​ది తప్పే : రాహుల్​ గాంధీ

దిగ్విజయ్​ది తప్పే అలా మాట్లాడకుండా ఉండాల్సింది: రాహుల్​ గాంధీ
ఆయన మాటలకు నేను క్షమాపణ చెబుతున్నా

జజ్జర్​కోట్లీ/జమ్మూ : సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కాంగ్రెస్​ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ అలా మాట్లాడాల్సింది కాదని, పార్టీ దీన్ని పూర్తిగా విభేదిస్తున్నదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆర్మీ ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇండియన్ ఆర్మీ ఏం చేసినా పక్కా ప్లానింగ్​తో చేస్తుందని, అంతటి సమర్థత మన ఆర్మీకే ఉందని తెలిపారు. మంగళవారం జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ కామెంట్లపై రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ‘‘పార్టీ సీనియర్ లీడర్ ఇలా మాట్లాడటం సరికాదు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నా. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్లు పర్సనల్​గానే చూడాలి. పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది. దిగ్విజయ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తాను. ఈ విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాను” అని రాహుల్​ అన్నారు.

కాంగ్రెస్​ డెమొక్రటిక్​ పార్టీ

దిగ్విజయ్​ సింగ్​పై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా, రాహుల్​ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్..​ డెమొక్రటిక్​ పార్టీ. పార్టీ పాలసీలు ఎవరిపైనా బలవంతంగా రుద్దం. సింగ్ అభిప్రాయాల కంటే.. పార్టీ అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం” అని రాహుల్ జవాబిచ్చారు.

రాహుల్​తో నడిచిన ఊర్మిళ మటోండ్కర్​

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో యాక్టర్, పొలిటీషియన్  ఊర్మిళ మటోండ్కర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. నాగ్రోటాలోని గ్యారీసన్ టౌన్ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు ఫుల్ సెక్యూరిటీ మధ్య భారత్ జోడో యాత్ర ప్రారంభ మైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు రాహుల్​కు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్​ వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి తారిఖ్ హమీద్ కర్రా కూడా యాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ లడఖ్ ప్రెసిడెంట్ నవాంగ్ రిగ్జిన్ ఆధ్వర్యంలో 65 మంది లడఖ్ ప్రతినిధుల టీం రాహుల్​ను కలిసింది. లంచ్​ బ్రేక్​ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు యాత్ర ఉదంపూర్ జిల్లాలోని ఆర్మీ గేట్​ రెహాంబల్​ నుంచి ప్రారంభమైంది.