దేశాన్ని ఏకం చేసింది ప్రధాని మోడీనే : రవీందర్ రైనా

 దేశాన్ని ఏకం చేసింది ప్రధాని మోడీనే : రవీందర్ రైనా

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు ఈ ప్రాంత ప్రజలకు  ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ జేకే చీఫ్ రవీందర్ రైనా డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి చారిత్రాత్మక తప్పిదాలు చేశాయని, వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద విస్ఫోటనానికి ప్రత్యక్ష బాధ్యత వహించాయని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే పార్టీల పట్ల కాంగ్రెస్ సానుభూతితో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. 

 దేశాన్ని నిజంగా ఏకం చేసింది ప్రధాని నరేంద్ర మోడీయేనని అన్న రవీందర్ ... ప్రతిపక్ష పార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు. 1947లో దేశం ఎందుకు విడిపోయిందో కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగుస్తుంది. భారత్ జోడో యాత్ర రేపు (గురువారం) సాయంత్రం పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లోకి ప్రవేశిస్తుంది.