కాంగ్రెస్ Vs బీజేపీ : కుక్క బిస్కెట్ల గోల

కాంగ్రెస్ Vs బీజేపీ : కుక్క బిస్కెట్ల గోల


రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. అయితే అక్కడ ఓ సంఘటన చోటుచేసుకుంది.  యాత్రలో భాగంగా ఓ వ్యక్తి..  తన పెంపుడు కుక్కను తీసుకువచ్చాడు.  ఈ క్రమంలో  రాహుల్ గాంధీ  ఆ కుక్కకు  బిస్కెట్‌ తినిపించడానికి ప్రయత్నించగా ఆ బిస్కెట్ తినడానికి పెంపుడు కుక్క నిరాకరించింది.  దీంతో  ఆ బిస్కెట్ ను కుక్క యాజమానికి ఇచ్చారు రాహుల్..  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

అయితే  దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆ కుటుంబం వాళ్లు వేసే బిస్కెట్‌ త‌న‌కు కూడా తినిపించాల‌ని చూశారని.. అందుకు తాను నిరాకరించి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.  ఆత్మగౌర‌వం క‌లిగిన అస్సామీగా, భారతీయుడిగా తానుగర్వపడుతున్నానని తెలిపారు.  

బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ బుత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పడు రాహుల్ గాంధీ ఏకంగ  కార్యకర్తలకు కుక్క బిస్కెట్లు ఇస్తున్నారు.  తమ కార్యకర్తలను కుక్కల్లా చూస్తుంటే, అలాంటి పార్టీ కనుమరుగు కావడం సహజమే కదా” అని కామెంట్ చేశారు.

దీనిపై  రాహుల్ గాంధీ స్పందించారు.  విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఆ కుక్కను తన వద్దకు తీసుకువచ్చినప్పుడు తాను ఇచ్చిన బిస్కెట్ తినలేదు కాబట్టి ఆ బిస్కెట్ ను పెంపుడు కుక్క యజమానికి ఇచ్చి నువ్వు తినిపించు అని చెప్పానన్నారు రాహుల్ . ఆ తర్వాత కుక్క ఆ బిస్కెట్ తినేసిందని..   కుక్కయజమాని కాంగ్రెస్ కార్యకర్త కాదని చెప్పారు రాహుల్.  ఇందులో ఏం తప్పుంది..  బీజేపీ నేతలకు కుక్కలు చేసిన హాని ఏమిటని రాహుల్ ప్రశ్నించారు.