
న్యూఢిల్లీ: తనకు కేటీఎం 390 బైక్ ఉందని, అయితే దానిని పార్కింగ్‌కే పరిమితం చేశానని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహు ల్ గాంధీ చెప్పారు. ఆ బైక్ పై రైడ్‌కు వెళ్లేం దుకు తన సెక్యూరిటీ సిబ్బంది అంగీకరిం చరని వివరించారు. ఇటీవల బైక్ మెకానిక్ లతో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో మెకానిక్ లు రాహుల్ ను పలు ప్రశ్నలు అడ గడం.. రాహుల్ జవాబు చెప్పడం, మెకాని క్ ల కష్టాలను అడిగి తెలుసుకోవడం తది తర వివరాలు ఉన్నాయి.
పెళ్లి ఎప్పుడు చేసు కుంటారని ఓ మెకానిక్ అడగగా.. దానికి సమయం ఉందని రాహుల్ చెప్పా రు. ‘‘ఇటీవలే ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో కొంత మంది మెకానిక్‌లను కలిశాను. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నా. వారికి ఆర్థిక సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది” అని రాహుల్ చెప్పారు.