అధికారంలోకి వస్తే.. సీఏఏను ఆపేస్తం

అధికారంలోకి వస్తే.. సీఏఏను ఆపేస్తం

శివసాగర్ (అస్సాం): తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అస్సాంలో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలును నిలిపివేస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. అస్సాం అకార్డ్ కు కట్టుబడి ఉంటామని, అందులోని ప్రతి అంశాన్ని కాపాడుతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ఆదివా రం శివసాగర్​లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘అస్సాంకు సొంత సీఎం కావాలి. జనం మాట విని వాళ్ల సమస్యలను పరిష్కరించేవాడు కావాలి. రిమోట్ కంట్రోల్​తో టీవీని ఆపరేట్ చేయాలి, సీఎంను కాదు. ఇప్పుడున్న సీఎం నాగ్​పూర్, ఢిల్లీ చెప్పినట్టు వింటున్నాడు.

మరోసారి ఇలాంటి సీఎంను ఎన్నుకుంటే ఉపయోగం ఉండ దు’ అని అన్నారు. అస్సాం అకార్డ్ రాష్ట్రంలో శాంతి ని నెలకొల్పిందని, ఇది రక్షణ కవచంగా నిలిచిందని చెప్పారు. ఇందులోని ప్రతి ప్రిన్సిపల్​ను తాను, తమ కార్యకర్తలు కాపాడుతామని హామీ ఇచ్చారు. అస్సాంలో అక్రమ వలసల ప్రాబ్లంను చర్చలతో పరిష్కరించుకునే సామర్థ్యం ప్రజలకు ఉందన్నారు. కాగా, అస్సాం అకార్డ్  ఇష్యూపై రాష్ట్రాన్ని విడదీయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ అన్నారు. అస్సాం విడిపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాలపై దీని ప్రభావం పడుతుందన్నారు.