పెట్రో పన్ను ​పైసలు ఏడికి పోతున్నయ్

పెట్రో పన్ను ​పైసలు ఏడికి పోతున్నయ్
  • పెట్రోల్​పై మనదగ్గరే మస్తు ట్యాక్స్
  • పన్ను ​పైసలు ఏడికి పోతున్నయని సర్కారును నిలదీయాలె: రాహుల్
  • 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గోవాలో ప్రచారం స్టార్ట్

పణజి: ప్రపంచంలో పెట్రోల్​పై ట్యాక్స్​ఎక్కువ వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియానే టాప్​లో ఉందని కాంగ్రెస్​ నేత రాహుల్ ​గాంధీ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల​పెంపుతో దేశంలో ఇద్దరు, ముగ్గురు బిజినెస్​మెన్లే లాభపడుతున్నారని చెప్పారు. ‘యూపీ సర్కారు హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్​ ఆయిల్ రేటు బ్యారెల్​కు140 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు బ్యారెల్ రేటు చాలా తక్కువగా ఉంది. కానీ ప్రజలంతా పెట్రోల్, డీజిల్​కు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు’ అన్నారు. వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ తరఫున రాహుల్​ శనివారం ప్రచారం స్టార్ట్ చేశారు. ఒకరోజు పర్యటనలో భాగంగా పొద్దున గోవా చేరుకొని, మధ్యలో రోడ్డు పక్కన హోటల్​లో భోజనం చేశారు. ఆ తర్వాత వెల్సావో బీచ్​లో ఫిషర్​మెన్​తో ఆయన మాట్లాడుతూ.. ట్యాక్స్​ డబ్బంతా ఎక్కడికిపోతోందో ప్రభుత్వాన్ని ప్రజలంతా అడగాల్సిన టైమ్​ వచ్చిందన్నారు. పెట్రోల్​ రేట్ల పెంపు, గోవాలో కోల్ హబ్ తో ఎవరు లాభపడుతున్నారో ప్రశ్నించాలన్నారు.

అందరితో మాట్లాడి మేనిఫెస్టో రెడీ చేస్తం
గోవాలోని వివిధ వర్గాల ప్రజలందరితో మాట్లాడి, చర్చించి కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టోను రెడీ చేస్తామని రాహుల్ చెప్పారు. తమ ఎన్నికల మేనిఫెస్టో కేవలం కమిట్ మెంట్ కాదని.. గ్యారంటీ అన్నారు. ‘మీ టైమ్​ను, నా టైమ్​ను వేస్ట్​ చేయడానికి నేనిక్కడికి రాలేదు. నాకు నా క్రెడిబిలిటీ ముఖ్యం. ఇక్కడేదైనా చెప్తే అది జరిగేలా చూస్తాను’ అన్నారు.

బీజేపీ జనాన్ని రెచ్చగొట్టి వీడదీస్తోంది
గోవా బీచ్​లో విపరీతంగా నిర్మాణాలు వెలుస్తున్నాయని ప్రజలు కంప్లైంట్ ​చేయగా.. అధికారంలోకి వస్తే గోవాను కోల్ హబ్​గా మారనీయబోమని రాహుల్ ​హామీ ఇచ్చారు. కాగా, పణజి మర్గావ్ ​హైవేలో ఉన్న బాంబోలిమ్ ​గ్రామంలో  రాహుల్‌‌ ఆగి రోడ్డుపక్కనున్న హోటల్​లో లంచ్​ చేశారు. అతనితో పాటు గోవా పీసీసీ చీఫ్ ​గిరీశ్​ ఛొడంకర్ ఉన్నారు.