
తన ట్విట్టర్ అకౌంట్ సస్పెన్షన్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ట్విట్టర్ ఒక వ్యాపార సంస్థ మాత్రమే అన్నారు. రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోమన్నారు రాహుల్. ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ప్రభుత్వం చెప్పినట్టు వింటోందన్నారు. ట్విట్టర్ లో తనకు దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారన్నారు. తన అకౌంట్ ను సస్పెండ్ చేసి కోట్లాది మంది గొంతు నొక్కారన్నారు. ఇది తనపై జరుగుతున్న దాడి కాదని... ప్రజాస్వామ్యంపై దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్.