సైనికుల పింఛన్ మొత్తాల్లో కోత విధించటం దారుణం

సైనికుల పింఛన్ మొత్తాల్లో కోత విధించటం దారుణం

సైనికుల పింఛన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్‌లో సైనికుల పింఛను మొత్తాల్లో కోత విధించటం దారుణమన్నారు. దేశంలో సామాన్య ప్రజలకంటే కొద్ది మంది బిజినెస్ ఫ్రెండ్స్ అంటేనే ప్రభుత్వానికి ఇష్టమని ఆరోపించారు. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఇందులో భాగంగా సైనికుల పింఛన్‌ మొత్తాలను తగ్గించటాన్ని రాహుల్‌ గాంధీ తప్పు పట్టారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శించారు.

ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం సమయంలో  ‘ప్రధాన మంత్రి’ అనే పదాన్ని ఆరు సార్లు వాడారని.. ఇక కార్పొరేట్లు లేదా కంపెనీలు అనే పదాలను పదిహేడు సార్లు వాడారన్నారు రాహుల్ గాంధీ. రక్షణ, చైనా అనే పదాలను ఒక్కసారి కూడా ఉపయోగించలేదని తెలిపారు.