సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న రాహుల్ గాంధీ

 సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ అగ్రనేత  రాహల్ గాంధీ సవాల్ చేయనున్నారు.  ఏప్రిల్ 03న గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో ఆయన సవాల్ చేయనున్నారని రాహుల్ గాంధీ తరుపు లాయర్ తెలిపారు. పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని గాంధీ తన పిటిషన్‌లో సెషన్స్ కోర్టును కోరినట్లు ఆయన తెలిపారు. కేసు తేలే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్ కోర్టును కోరనున్నారు.

ప్రధాని మోడీ ఇంటిపేరుతో ఉన్న వాళ్లందరూ దొంగలే అంటూ  2019లో కర్నాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. 2023, మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై వేటు వేసినట్టు లోక్ సభ వెల్లడించింది. రాహుల్ గాంధీ ఎంపీగా చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించటం రాజకీయ దుమారం రేపుతోంది.  ఇక తమ పార్టీ నాయకుడిపై ఈ రకమైన చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.