మే 31న అమెరికాకు రాహుల్ గాంధీ!

మే 31న అమెరికాకు రాహుల్ గాంధీ!

కాంగ్రెస్‌ సీనియర్ నేత  రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. మే  31న రాహుల్ గాంధీ అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. ఒక వారం పాటు యూఎస్‌లో ఉండనున్న రాహుల్  జూన్ 4 న మాడిసన్ స్క్వేర్‌లో దాదాపు 6 వేల  ప్రవాస భారతీయులు హాజరయ్యే సభలో ప్రసంగించనున్నారు. అలాగే   కాలిఫోర్నియా  కూడా వెళ్లనున్నారు. అక్కడ  యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వాషింగ్టన్ కూడా వెళ్లనున్నారని సమాచారం.

రాహుల్ గాంధీ మార్చిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. తనతో సహా పలువురు రాజకీయ నాయకులపై నిఘా పెట్టారని చెప్పారు.