మళ్లీ విదేశాలకు రాహుల్.. సెప్టెంబరులో యూరప్ 

మళ్లీ విదేశాలకు రాహుల్.. సెప్టెంబరులో యూరప్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబరు నెలలో విదేశాల్లో పర్యటించనుపన్నారు.  2023 సెప్టెంబరు 7 నుంచి 11 వరకు యూరప్‌లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  అక్కడ ఆయన భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని తెలిపాయి.  2023 ఆగస్టు 7న లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.  

2023 లో రాహుల్ గాంధీకి ఇది మూడో విదేశీ పర్యటన.  అంతకుముందుఈ ఏడాది మే చివరి వారంలోఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ అనే మూడు నగరాలకు వెళ్లారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, అమెరికన్ ఎంపీలతో పాటు భారతీయ సమాజానికి చెందిన ప్రజలను కలిశారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీపైనా , బీజేపీపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అమెరికా పర్యటనకు ముందు ఈ ఏడాది రాహుల్ లండన్‌ను సందర్శించారు. లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగించారు.  

రాహుల్ ఇటీవలి విదేశీ పర్యటనలు భారత్ లో పెద్ద దుమారాన్నే   రేపాయి. విదేశీ గడ్డపై భారత వ్యతిరేకతను  రాహుల్ అనుసరిస్తున్నారని అధికార బీజేపీ ఆరోపించింది.  విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను రాహుల్  దిగజార్చారని బీజేపీ ఆరోపించింది. మణిపూర్ ఆంశం, తన పార్లమెంట్ సభ్య్యత్వాన్ని రద్దు చేయడం లాంటి ఆంశాలపై ఇప్పటికే లోక్ సభ దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలో విదేశీ పర్యటనలో రాహుల్ ఏం మాట్లాడబోతున్నరన్నది ఆసక్తికంగా మారింది.