మట్టి ప్రమిదలు చేసిన రాహుల్ గాంధీ

మట్టి ప్రమిదలు చేసిన రాహుల్ గాంధీ

రాయ్పూర్: ఛత్తీస్ఘడ్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేపు సరదాగా గడిపారు. రాయ్పూర్లో అమర్ జవాన్ జ్యోతి స్మారక స్థూపం
శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు రాయ్పూర్లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆయన
సందర్శించారు. అక్కడ ఓ వ్యక్తి మట్టి ప్రమిదలు చేయడాన్ని గమనించిన రాహుల్ వాటిని ఎలా చేస్తున్నారో కాసేపు పరిశీలించారు. అనంతరం తాను
కూడా మట్టితో ప్రమిదలు చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఛత్తీస్ఘడ్ సీఎం భూపేష్ భగల్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ
వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.