BJP భగావో.. బేటీ బచావో.. : రాహుల్ ట్వీట్

BJP భగావో.. బేటీ బచావో.. : రాహుల్ ట్వీట్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ అత్యాచారం కేసు వివాదంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. షాజహాన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తప్పుపట్టారు.

“బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు బీజేపీ ప్రభుత్వం వంతపాడుతోంది. దీనిపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటూ… అరెస్ట్ చేయిస్తోంది. ఈ సంఘర్షణలో.. ప్రభుత్వం, పోలీసుల అణచివేతను ఎదుర్కొంటాం. బాధితుల పక్షాన నిలబడి.. పోరాడుతాం. బీజేపీని తరిమేయండి… బాలికలను రక్షించండి (బీజేపీ భగావో.. బేటీ బచావో)” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

దుర్గా నవరాత్రి వేడుకలు జరుగుతున్న సమయంలో.. 2వేల మందితో ర్యాలీకి అనుమతి ఇవ్వడం కుదరదనీ.. శాంతిభద్రతలకు ఇబ్బంది అవుతుందని షాజహాన్ పూర్ జిల్లా పోలీసులు ఓ ప్రకటన చేశారు. ఈ కారణాలతో ర్యాలీలకు పర్మిషన్ లేదంటూ.. 144 సెక్షన్ విధించారు. నిరసనకు ప్రయత్నించినవారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.