పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చెల్లెలికి రాహుల్ రక్షా బంధన్ శుభాకాంక్షలు

పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చెల్లెలికి రాహుల్ రక్షా బంధన్ శుభాకాంక్షలు

పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంక గాంధీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. చిన్నతనం నుంచి వేర్వేరు సందర్భాల్లో చెల్లెలితో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఈ స్పెషల్ అకేషన్‌లో విష్ చేశారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌కి కూడా రాఖీ పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. చెల్లెలితో ఉన్న స్నేహం, ఆత్మీయతకు తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందని, తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదని, ఒకరికొకరం మంచి ప్రొటెక్టర్స్ కూడా అని ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు. రక్షా బంధన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌‌ చేసిన తన చెల్లితో ఉన్న ఫొటోలను తర్వాత కొద్ది సేపటికి మళ్లీ ఇన్‌స్టా స్టోరీలోనూ పోస్ట్ చేశారాయన.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఆ రాష్ట్ర ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఓనం పండుగ కూడా కావడంతో ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. కేరళలోని భిన్నత్వాన్ని, ఐక్యతను చాటే పండుగ ఓనం అని రాహుల్ పేర్కొన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)