మహాత్మా కోట్‌ను ట్వీట్ చేసిన రాహుల్

 మహాత్మా కోట్‌ను ట్వీట్ చేసిన రాహుల్

ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయంపై ఆయన మొదటిసారి స్పందించారు. తన మతమనేది సత్యం, అహింసపై ఆధారపడిందని, సత్యమే తన దేవుడని, అహింసే దానిని పొందే సాధనమనే మహాత్మా గాంధీ కోట్ ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రధాని ఇంటి పేరుపై తీవ్ర కామెంట్లు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ ఆయన అప్పట్లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు.. తాజాగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటన్ 30 రోజుల బెయిల్ ను మంజూరు చేసింది.

https://twitter.com/RahulGandhi/status/1638793459409780737