భారత్ జోడో యాత్రలో బుల్లెట్ బండి ఎక్కిన రాహుల్

 భారత్  జోడో యాత్రలో బుల్లెట్ బండి ఎక్కిన రాహుల్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 5వ రోజు కొనసాగుతోంది.  ఇవాళ మోవ్ జిల్లా నుంచి 81వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి మోవ్ జిల్లాలన్నీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర, దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు సాగనుంది. 3 వేల 5 వందల కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారిలో మొదలైన రాహుల్ యాత్ర కాశ్మీర్ వరకు సాగనుంది. రాహుల్ చేస్తున్న భారత్ జోడోయాత్రలో పాల్గొనేందుకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.

పాదయాత్ర టైంలో సరదాగా బుల్లెట్ బండి నడిపారు రాహుల్. ఆయన బైక్ పై వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు హుషారుగా ఆయన వెనకే పరిగెడుతూ వెళ్లారు. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జన్మస్థలం అయిన అంబేడ్కర్ నగర్ కు చేరుకుంది.