రాహుల్​టూర్​లో మార్పులు.. బోధన్​, నిజామాబాద్ పర్యటన రద్దు 

రాహుల్​టూర్​లో మార్పులు.. బోధన్​, నిజామాబాద్ పర్యటన రద్దు 

హైదరాబాద్, వెలుగు: రాహుల్​గాంధీ టూర్​లో మార్పులు జరిగాయి. ఆయన అనివార్య కారణాలతో శుక్రవారం టూర్​లో కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. పాత షెడ్యూల్​ ప్రకారం బోధన్, నిజామాబాద్ లో రాహుల్ పర్యటించాల్సి ఉండగా.. ఆ రెండు పర్యటనలు రద్దయ్యాయి. బోధన్​లో బీడీ కార్మికులు, షుగర్​ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్​కార్మికులతో సమావేశమై అనంతరం షుగర్​ఫ్యాక్టరీని సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్​కు వెళ్లాల్సి ఉంది. కానీ, బోధన్ టూర్​లేకుండా నేరుగా ఆర్మూర్​కు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత నిజామాబాద్​కు వెళ్లి పాదయాత్ర చేసి పసుపు రైతులతో సమావేశం కావాల్సి ఉండగా, దాన్ని క్సాన్సిల్​చేసుకున్నారు. ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్లే రాహుల్ పర్యటనలో మార్పులు జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  

ఇదీ రివైజ్డ్ షెడ్యూల్..​

శుక్రవారం ఉదయం 9గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశంలో రాహుల్​పాల్గొంటారు. 9:30 గంటలకు కొండగట్టు వెళ్లి అంజన్నను దర్శించుకుంటారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్​మీటింగ్​లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, ఒంటిగంటకు కోరుట్లలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం 2:30 గంటలకు ఆర్మూర్​బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్తారు.