ట్రైన్ ఇంజన్, బోగీ మధ్య ఇరుక్కొని రైల్వే ఉద్యోగి మృతి

ట్రైన్ ఇంజన్, బోగీ మధ్య ఇరుక్కొని రైల్వే ఉద్యోగి మృతి

డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగి అమర్ కుమార్ ప్రమాదవశాత్తు ఇంజన్, రైలు బోగీల మధ్య చిక్కుకొని మరణించారు. ఈ విషాద ఘటన బీహార్ లోని బెగురాయియ్ జిల్లా బరౌని రైల్వే జంక్షన్ లో చోటుచేసుకుంది. ఇంజన్ నుంచి కోచ్ లను వేరు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్ కు బోగీలకు మధ్య ఉన్న లింక్ ను తొలగించిన ఉద్యోగి.. బయటకు వస్తుండగా డ్రైవర్ ఇంజన్ ను వెనక్కి రానిచ్చాడు. దీంతో 35ఏళ్ల రైల్వే ఎంప్లాయ్ శటింగ్ ఆపరేషన్ సమయంలో మరణించాడు. 

ఇంజన్ నుంచి బోగీలను డీకప్లింగ్ చేస్తుండగా.. రైలు డ్రైవర్ సడెన్ గా ఇంజన్ ను వెనక్కి నడిపాడు. ఇంజన్, బోగీ మధ్య అమర్ కుమార్ నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రైన్ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారీ అయ్యాడు. శనివారం రౌత్ లక్నో-,బరౌనీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్ 15204 బరౌనీ జంక్షన్‌లో ప్రయాణం ముగిసింది. ఇంజిన్‌ను డీకప్ చేస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై అప్రమత్తమైన సోన్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ కేసుపై అధికారి స్థాయి విచారణకు ఆదేశించారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుంటామని రైల్వే సీనియర్ అధికారు హామి ఇచ్చారు.