హైదరాబాద్‌సిటీ, వెలుగు: రైల్వే భద్రతను మరింత బలోపేతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్రైల్నిలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనివార్య సంఘటలను నివారించడానికి ట్రాక్‌ల భద్రతను బలోపేతం చేసేందుకు, పాయింట్లు, క్రాసింగ్‌లు, భద్రతకు సంబంధించిన అలారమ్ల వద్ద భద్రతా కట్టుదిట్టం చేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌లు, తనిఖీలు చేపట్టాలన్నారు.
నాన్ -ఇంటర్‌లాక్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను పరిశీలించడంతో పాటు జోన్ అంతటా రైలు ఫిట్టింగ్‌ల నాణ్యతను సమీక్షించారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం సత్య ప్రకాష్ , సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డీఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.
