Weather Alert: తెలంగాణలో ఈ వీకెండ్ అంతా వర్షాలే

Weather Alert: తెలంగాణలో ఈ వీకెండ్ అంతా వర్షాలే

ఈ వీకెండ్ బయటికెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోండి.. లేదంటే ప్లాన్ ఫెయిల్ అయ్యిందన్న డిజప్పోయింట్మెంట్ తో పాటు డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.ఈరోజు రేపు, ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం మారుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని, 7వ తేదీ నుండి మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు. 8వ తేదీన భారీ వర్షా రాష్ట్రంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది ఐఎండీ.భారీవర్షాల నేపథ్యం లో రాష్ట్ర నికి 7 తారీకు నుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైద్రాబాద్ వాతావరణ శాఖ అధికారులు.