రెయిన్ అలర్ట్: రెండు రోజులు దంచుడే.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

రెయిన్ అలర్ట్:  రెండు రోజులు దంచుడే.. ఈ  జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణలో  వచ్చే మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.  ప్రస్తుతం పశ్చిమ మధ్య  బంగారఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలపడి అల్పపీడనంగా మారిందని ..  రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్  ఉందని వెల్లడించింది. దీని ప్రభావంత్ సెప్టెంబర్ 25, 26న   భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. 

 11 జిల్లాలకు   ఆరెంజ్ అలర్ట్.. 

 ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్ అసిఫాబాద్ ,మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,  భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ,కరీంనగర్,  జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో  భారీ వర్షాల పడతాయిని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్..  సెప్టెంబర్ 26న  భారీ వర్షాల కురిసే అవకాశం ఉంది. 

 33 జిల్లాల్లో వర్షాలు..

 సెప్టెంబర్ 26న  15 జిల్లాలకు అతి భారీ వర్షాలు, 18 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.  నిజామాబాద్ , జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ ,సంగారెడ్డి, వికారాబాద్ ,మహబూబ్నగర్ ,వనపర్తి, నాగర్ కర్నూల్ ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.