
హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.గురువారం (జూన్ 5) ఉదయం నుంచి ఎండలతో ఉక్కపోత, వేడిమికి ఇబ్బంది పడ్డ నగర వాసులకు సాయంత్రానికి ఉపశమనం లభించింది. గురువారం సాయంత్రం సిటీలోని కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వానపడింది.
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, సూరారం, చింతల్, గాజుల రామారం ప్రాంతాల్తో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఎండలతో సతమతమయిన ప్రజలకు ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంలో రిలాక్స్ అయ్యారు. రాబోయే రెండు రోజులు కూడా ఇదే సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.