రాఖీ పండగకు ఊరెళ్తున్నారా.. హైదరాబాద్లో వర్షం స్టార్ట్.. ఈ ఏరియాల్లో వెళ్లే వాళ్లు జగ్రత్త !

రాఖీ పండగకు ఊరెళ్తున్నారా.. హైదరాబాద్లో వర్షం స్టార్ట్.. ఈ ఏరియాల్లో వెళ్లే వాళ్లు జగ్రత్త !

హైదరాబాద్ లో  వర్షం స్టార్టయింది. శుక్రవారం (ఆగస్టు 08) పగలంతా పొడి వాతావరణంతో, అప్పుడప్పుడు ఎండ కాస్తూ కనిపించిన వెదర్.. సాయంత్రం చల్లబడింది. రాత్రి పది గంటల ప్రాంతంలో నగరంలో వర్షం మొదలైంది. అక్కడక్కడ చిరుజల్లులతో మొదలైన వాన.. భారీ వర్షంగా మారుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. 

దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వర్షం మొదలవ్వటంతో షటర్ల కిందికి పరిగెత్తారు. మరోవైపు శనివారం (ఆగస్టు 09) రాఖీ పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. అదే సమయంలో వర్షం స్టార్టవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దిల్ సుఖ్ నగర్ తో పాటు మలక్ పేట్, చంపాపేట్ లో భారీ వర్షం కురుస్తోంది.

మరోవైపు చార్మినార్‌, సైదాబాద్‌, మలక్‌పేట్‌, ఎంజీబీఎస్‌, కోఠి, బహదూర్‌పురా, శాలిబండ, గౌలిగూడ, బండ్లగూడ, నాంపల్లి, అంబర్‌పేట్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

అటు మీర్ పేట్, బాలాపూర్, బడంగ్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం మెల్లమెల్లగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉండటంతో నగరవాసులు బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు.