రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో హాస్పిటల్కు ప్రతీక్షలో 76 % వాటా

రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో హాస్పిటల్కు ప్రతీక్షలో 76 % వాటా

న్యూఢిల్లీ: మల్టీ-స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్స్ చైన్ రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎంఎల్) గువాహటిలోని ప్రతీక్ష హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 76 శాతం వాటాను సుమారు రూ. 171 కోట్లకు కొననుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ సంస్థ ఈ వాటా కొనుగోలుకు ప్రతీక్ష హాస్పిటల్ ప్రమోటర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ. 171 కోట్లు, దీనిని కంపెనీ నగదు నిల్వలు అంతర్గత వనరుల ద్వారా సమకూర్చనుంది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎంఎల్ 76 శాతం వాటాను కొనుగోలు చేయగా, ప్రమోటర్ డాక్టర్ శర్మ, ఆయన కుటుంబం చేతిలో మిగిలిన వాటా ఉంటుంది.