రోజూ ఇదే పరిస్థితి.. రాత్రి దంచికొడుతున్న వానలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు మరో రెండు గంటల పాటు వర్షాలు

రోజూ ఇదే పరిస్థితి.. రాత్రి దంచికొడుతున్న వానలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు మరో రెండు గంటల పాటు వర్షాలు

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటలు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. నగరవాసులు లేట్ నైట్ జర్నీలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

హైదరాబాద్ లో గురువారం (సెప్టెంబర్ 25) ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా.. మధ్యాహ్నం తర్వాత చిరుజల్లులు కురిశాయి. సాయంత్రంర కూడా ముసురు పడుతూనే ఉంది. అయితే రాత్రి 11 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. చెప్పినట్లుగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం ఊపందుకుంది. 

వచ్చే 23 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు:

వచ్చే 23 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి జల్లులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని పేర్కొంది.

 హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం తో పాటు గంటకు 41 - 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని అధికారులు తెలిపారు.