రాజ్ తరుణ్ హీరోగా రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘టార్టాయిస్’. అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కథ. చాలా కొత్తగా ఉంటుంది. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో తను ఒక అమ్మాయిని చంపేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. 25వ చిత్రంగా రాజ్ తరుణ్ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. అనూప్ రూబెన్స్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.
