మంత్రి హరీశ్​రావుకి ఫ్యాన్​ అయ్యా: ఎస్​ ఎస్​ రాజమౌళి

మంత్రి హరీశ్​రావుకి ఫ్యాన్​ అయ్యా: ఎస్​ ఎస్​ రాజమౌళి

సిద్దిపేట అభివృద్ధి చూసినప్పటి నుంచి మంత్రి హరీశ్​రావుకి తాను ఫ్యాన్​ అయ్యానని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు.  బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్​గా హాజరైన ఆయన మాట్లాడుతూ..  సిద్దిపేటలో గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా అభివృద్ధి జరిగిందని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి హరీశ్​రావు కృషి తెలిశాక.. తాను మంత్రి అభిమానిగా మారానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్​ సైతం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 

తెలుగు జాతి ఖ్యాతిని ఆకాశానికెత్తిన రాజమౌళి..  

ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్​ రావు మాట్లాడుతూ.. బాహుబలితో తెలుగు సినిమాను దేశ వ్యాప్తం చేస్తే.. ఆర్​ఆర్​ఆర్​తో విశ్వవ్యాప్తం చేశారని పేర్కొన్నారు. ఆర్​ఆర్​ఆర్​ సినిమా ఆస్కార్​ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. రాజమౌళిని మంత్రి సత్కరించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సినిమాలు తీసి,  విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.