జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ స్టార్

జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజైన మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దీంతో జైలర్ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమే వార్తలు బలంగా వినిపించాయి. ఇక తాజాగా జైలర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది.

ఈ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా మొదటిరోజు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.43 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. అమెరికాలో సైతం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ జైలర్ సినిమా మొదటిరోజు ఏకంగా 1.450 మిళియన్ కలెక్షన్స్ రాబట్టిందట. అంతకుముందు విజయ్ బెస్ట్ సినిమాపై ఉన్న 1.375 రికార్డ్స్ ను జైలర్ క్రాస్ చేసింది. జైలర్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు లాంగ్ రన్ లో జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.