ఒకప్పుడు హీరోగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త టర్న్ తీసుకుంటూ విభిన్న పాత్రల వైపు అడుగులు వేస్తున్నారు. హీరో పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుంటున్న ఆయన, తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రాజశేఖర్‌ను సంప్రదించారట మేకర్స్. హీరో పాత్రకు బలమైన ప్రతినాయకుడిగా నిలిచేలా రాజశేఖర్ పాత్రను కొరటాల శివ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో పాటు పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉండటంతో రాజశేఖర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
రాజశేఖర్ గతంలోనే తాను హీరో పాత్రలతో పాటు విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధమేనని పలు సందర్భాల్లో చెప్పడంతో ఇది నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతుండగా, టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
