
రాష్ట్రంలో అక్రమంగా గో హత్యలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పాతబస్తీలో అక్రమంగా స్లాటర్ హౌజ్ లు నడుస్తున్నాయని ఆరోపించారు.ఎంఐఎంకి సపోర్ట్ చేసే సీఎం గోహత్యాలను పట్టించుకోవడం లేదన్నారు. గో హత్యలను నివారించకుంటే పోలీస్ కమిషనర్ ఆఫీసు ముందు, సీఎం ఫాంహౌజ్ ముందు గోమాతలతో ధర్నా చేస్తామని చెప్పారు రాజాసింగ్. చౌటుప్పల్ నుంచి 33 ఆవు దూడలను హైదరాబాద్ బహదూర్ పురాలోని కబేలాకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆవు దూడలను తరలిస్తున్న వారిని పట్టుకుని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.