కేంద్రం ప్రతిపక్షాలను వేధిస్తోంది

కేంద్రం ప్రతిపక్షాలను వేధిస్తోంది

జైపూర్: ఈడీ, సీబీఐని ప్రయోగిస్తూ... కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఉదయ్‌పూర్‌లో జరుగనున్న కాంగ్రెస్‌ మేథోమధనం సదస్సు ఏర్పాట్లను సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇళ్లలోకి ప్రవేశించిన ఈడీ, సీబీఐ అధికారులు ఏడు రోజులైనా బయటకు వెళ్లడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తొత్తులుగా ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. చింతన్ శివిర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించేందుకే కేంద్ర ఈడీ, సీబీఐని వాడుకుంటోందని అన్నారు. దేశం క్లిష్ట కాలంలో ఉన్నదని  అశోక్ గెహ్లాట్... దేశాన్ని ఆ పరిస్థితుల నుంచి కాపాడటానికి ‘నవ్ సంకల్ప్ శివిర్’ దోహదపడుతుందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ వంటి వారు వీరమరణం పొందారని గుర్తు చేశారు. అయితే ఈ రోజు అధికారంలో ఉన్నవారు గత 70 ఏళ్లలో ఏమి జరిగిందని అడుగుతున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ రహిత భారత్‌ గురించి మాట్లాడే వారికే త్వరలో విముక్తి లభిస్తుందన్నారు.