హైదరాబాద్ లో గ్రామ్ ఇన్వెస్టర్ల భేటీ..రూ.200 కోట్ల విలువైన ఎంఓయూలు

హైదరాబాద్ లో గ్రామ్ ఇన్వెస్టర్ల భేటీ..రూ.200 కోట్ల విలువైన ఎంఓయూలు

హైదరాబాద్​, వెలుగు: తమ రాష్ట్రాన్ని వ్యవసాయ టెక్నాలజీ హబ్​గా మార్చడంలో భాగంగా రాజస్థాన్​ హైదరాబాద్​లో గ్లోబల్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్ (గ్రామ్)-2026 ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొన్నారు. అగ్రికల్చర్, అగ్రిటెక్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలు తమ ఉత్పత్తులను  ప్రదర్శించాయి. 

ఐక్రిసాట్‌తో పాటు ఇతర కంపెనీలతో రూ.200 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రాజస్థాన్ సాంప్రదాయ వ్యవసాయం నుంచి సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందని సీఎం పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, డిజిటల్ అగ్రిటెక్ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిక్కీ, రాజస్థాన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.