Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ ఫైనల్.. పటిదార్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా కావాల్సిందే

Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ ఫైనల్.. పటిదార్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా కావాల్సిందే

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో గురువారం (సెప్టెంబర్ 11) సౌత్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భాగంగా సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పటిదార్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ మైండ్ పోగొడుతుంది. డైవింగ్ చేస్తూ డైవింగ్ చేస్తూ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  ఇన్నింగ్స్ 49 ఓవర్లో ఈ అద్భుతమైన క్యాచ్ చోటు చేసుకుంది. 49వ ఓవర్లో మూడో బంతిని సరాన్ష్ జైన్ బౌలింగ్ లో సల్మాన్ నజీర్ డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతని గ్లోవ్‌ను తాకింది.

అక్కడే సిల్లీ పాయింట్ దగ్గర ఉన్న ఫీల్డర్ క్యాచ్ ను పట్టుకువడంలో విఫలమయ్యాడు. బంతి చేతికి తగిలి కింద పడుతున్న సమయంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న పటిదార్.. షార్ప్ గా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ మిస్ అయిందన్న సమయంలో పటిదార్ ఊహించని విధంగా పట్టిన ఈ క్యాచ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అప్పటికే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌత్ జోన్ పటిదార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కారణంగా ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో కుదురుకున్న సల్మాన్ నిజార్ 24  పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. 

ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ కుమార్ కార్తికేయ తన స్పిన్ మ్యాజిక్ తో నాలుగు వికెట్లు తీయగా.. సరాన్ష్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తన్మయ్ అగర్వాల్ 76 బంతుల్లో మూడు బౌండరీలతో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సెంట్రల్ జోన్ ప్రస్తుతం వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది.  సెంట్రల్ జోన్ 107 పరుగులు వెనుకబడి ఉంది.