సీఎం కేసీఆర్ కు అందరిని వాడుకొని వదిలేయడం కామన్ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైన ఆయనకు బుద్ది చెప్పకపోతే నష్టపోతామన్నారు. మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజగోపాల్.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామనన్న కేసీఆర్ నట్టేట ముంచారన్నారు. అవినీతి సొమ్ముతో గెలవాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్చు చెప్పాలన్నారు. మంత్రి కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాతున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డ బండి సంజయ్ యాదాద్రి ప్రమాణం చేస్తే గుడిని సంప్రోక్షణ చేయాలనడమేంటన్నారు.
ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ పేద ప్రజలకు న్యాయం చేయలేదని రాజగోపాల్ అన్నారు. కేసీఆర్ అధికారం, డబ్బును నమ్ముకుని వస్తే.. తాను జనాన్ని నమ్ముకుని వచ్చారని చెప్పారు. అవినీతి సొమ్ముతో టీఆర్ఎస్ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ పాలనలో దళితుల జీవితాలు బతుకులు మారలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తా అని ఇయ్యలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు.
