అయోధ్య ప్రారంభోత్సవానికి రండి.. రజనీకాంత్కు ఆహ్వానం

అయోధ్య ప్రారంభోత్సవానికి రండి..   రజనీకాంత్కు ఆహ్వానం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు రా.అర్జునమూర్తి  తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్నిఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  రజినీకాంత్ ను  ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని అన్నారాయన. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యకక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. రజనీకాంత్‌తో పాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రతన్ టాటాలు కూడా ఆహ్వా్నం అందింది.

ముహూర్తం ఖరారు 

అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్‌‌ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయ్యింది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌‌ రాయ్‌‌ తెలిపారు. పట్టాభిషేకం తర్వాత హారతి, సూర్యాస్తమయం అనంతరం దీపాలను వెలిగిస్తారని వెల్లడించారు. రామ్‌‌ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. 

ప్రధాన వాస్తు శిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్‌‌ ఈ విషయంపై స్పందిస్తూ.. రామ్‌‌ లల్లా విగ్రహం కర్టెన్‌‌ను ప్రధాని మోదీ మాత్రమే తొలగిస్తా రని తెలిపారు. అనంతరం రామయ్యకు కాటుక దిద్ది.. విగ్రహానికి బంగారు వస్త్రాలతో అలంకరిస్తామని వెల్లడించారు. ప్రత్యేక పూజలతో పాటు 56 నైవేద్యాలను సమర్పిస్తారని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు బాల రామయ్య విగ్రహా న్ని అయోధ్యలో ఊరేగింపునకు తీసుకువెళ్తారని చెప్పారు.