సెట్స్ పైకి వెళ్లిన జైలర్

సెట్స్ పైకి వెళ్లిన జైలర్

సూపర్ స్టార్ రజిని కాంత్ తాజా చిత్రం ‘జైలర్’ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో రజిని చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. డిఫరెంట లుక్ లో ఆయన కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించడం నెల్సన్ దిట్ట. ఆయన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన రూపొందించిన ‘బీస్ట్’ షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ‘జైలర్’ చిత్రం జైలు చుట్టూ తిరుగుతుందని సమాచారం. 

రజిని కాంత్ ఎక్కువగా యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. ‘కబాలి’ నుంచి ఆయన వారి దర్శకత్వంలో పని చేస్తున్నారు. పా. రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్.. శివతో సినిమాలు చేస్తూ వచ్చారు. రజినిని కొత్తగా చూపించడంలో వారు సక్సెస్ అయ్యారు. జైలర్ సినిమాకు సంబంధించి ఇటీవలే ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ ఛైన్ కు రక్తసిక్తమైన కత్తిని వేలాడదీశారు. ఒక్క పోస్టర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. రజినికాంత్ తో ఎవరు జోడి కడుతారనేది తెలియరాలేదు.